సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ అవిశ్రాంతంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నం అయ్యిందని బిజెపి షాద్ నగర్ నియోజక వర్గ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్ పిలుపు ఇచ్చారు. శుక్రవారం బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశానికి ఏపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి హాజరైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి షాద్ నగర్ నియోజక వర్గ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశంలో కీలక విషయాలు దిశా నిర్దేశం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. రానున్న రోజులు చాలా ముఖ్యమైనవిగా భావించి నేటి నుంచి అవిశ్రాంతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీయాల్సిన అవసరం ఉంటుందని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులతో పాటు పలువురు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి షాద్ నగర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, భూపాలచారి, ఏపీ మిథున్ రెడ్డి, అందె బాబయ్య, చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin