సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / భవిష్యత్తు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్షితులై ఎందరో పార్టీలో చేరుతున్నారని వారందరికీ పార్టీ సంతోషంగా స్వాగతిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గంలోని కేశంపేట మండలం చౌలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర సంక్షేమానికి పెద్ద పీఠ వేసిన ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. మరోసారి అవకాశం వస్తే కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి చేయడం ఖాయమని అన్నారు. ప్రభుత్వానికి ప్రజా సహకారం ఎంతో అవసరమని ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని చూసి సహకరిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు వీలుంటుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సరైన న్యాయం జరుగుతుందని అన్నారు. చౌలపల్లి గ్రామం నుండి పార్టీలో చేరిన వారిలో బొల్లం పుల్లయ్య, బోల్లం మహేష్, చిలకల హరికిషన్, రమేష్, పడకంటి చిన్నయ్య, చాకలి నరసింహ, శివకుమార్, రమేష్, కుమ్మరి నరేష్, బైండ్ల సురేష్, అనపూసల జంగయ్య, గోవర్ధన్, పడకంటి పెద్దరామయ్య, చాకలి నాగరాజు, రాకేష్, జింకల నరేష్, గొడ్డలి శివయ్య, జింకల స్వామి, కర్నాటి నారాయణ, ఆవుల శివ, గుడ్డేటి శివ నక్కల శివ నక్కల మణికంఠ, మహమ్మద్ ఆరిఫ్, బొల్లం సైదులు, చిలకల బుచ్చయ్య, గుడ్డేటి శివయ్య తదితరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు...
-----------------------
Admin