Saturday, 01 August 2026 01:06:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆజాద్ అధికారసేన రాష్ట్ర అధ్యక్షులుగా ఇమంది ఉదయకుమార్....

Date : 12 October 2023 06:41 AM Views : 349

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఆజాద్ అధికార్ సేన రాష్ట్ర అధ్యక్షులుగా కొత్తగూడెం సినియర్ పాత్రికేయులు, ఉషోదయ చారిటబుల్ ట్రస్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సూర్యా ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇమంది ఉదయ్ కుమార్ మాట్లాడారు. ఆజాద్ అధికార్ సేన జాతీయ అధ్యక్షులు అమితాబ్ ఠాగూర్ (మాజీ ఐపిఎస్), జాతీయ కార్యదర్శి దేవేందర్ సింగ్ రాణా, సెంట్రల్ కార్యాలయం లక్నో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తర్వులను పంపించడం జరిగింది . రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆజాద్ అధికార్ సేన పార్టీ నుంచి వద్రాద్రి) కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజ వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసేందుకు అనుమతులు ఇచ్చారని అన్నారు. అంతే కాకుండ తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆజాద్ అధికార్ సేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. గడప గడపకు రాజ్యాంగం చేరేలా ప్రతి పౌరునికి సమన్యాయం జరిగేలా సబ్బండ వర్గాలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటికే పలు అన్యాయాలపై అవినీతి, అణచివేతలపై ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన జర్నలిజం ద్వార అలుపెరగని పోరాటం చేస్తున్న ఇమంది ఉదయ్ కుమార్ పై నమ్మకం ఉంచి ఆజాద్ అధికార్ సేన రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక చేయడం పట్ల జాతీయ అద్యక్షలు అమితాబ్ ఠాగూర్ జాతీయస్థాయి కార్యదర్శి దేవందర్ సింగ్ రాణాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల సుధాకర్ రావు ,అల్లపు శంకర్, దశరథ రజువా, సీమకుర్తి రామకృష్ణ ,ఇమంది గణేష్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా ఆజాద్ అధికార సేన పార్టీ తరఫునుంచి పోటీ చేస్తున్న సందర్భంగా పాత్రికేయ వర్గం హర్షం వ్యక్తం చేసింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :