సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం) *పల్లవి మండల సమాఖ్య, సమావేశాలలో జిల్లా పిడి* సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం పల్లవి మండల సమాఖ్య నందు MCLF మండలాల గ్రామసంఘాల లీడర్లకు మూడు రోజులు "విజన్ బిల్డింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్"పైన శిక్షణా కార్యక్రమంను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ K.N.నరసయ్య మాట్లాడుతూ.......ప్రతి సభ్యురాలు కుటుంబ జీవనోపాధిని మెరుగు పరుచుకోవాలి. ప్రస్తుత కుటుంబ పరిస్థితులలో మార్పు తప్పని సరిగా రావాలి. ప్రతి సభ్యురాలు ఒక ఉన్నతమైన కల ఊహించుకుని దానిని సాకారం చేసుకోవడానికి ఈ శిక్షణ నుండే అడుగులువేయాలి. ప్రతి సభ్యురాలు కుటుంబ ఆదాయం నెలకు కనీసం రూ.10000 నుండి రూ.20000 ఉండేటట్లు ప్రణాళిక చేసుకోవాలి. మంచి మండల సమాఖ్యగా ఉండాలి. డి.పి.యం-యల్.హెచ్ రామమోహన్ మాట్లాడుతూ......... పంచసూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఋణమొత్తం వినియోగంలో సంఘానికి 25లక్షలు పరిమితికి చేరాలి. భవిష్యత్ ప్రణాళిక తయారు చేసుకోవాలి. డి.పి.యం- ఐ.బి శ్రీ నాగరాజు మాట్లాడుతూ...... సంస్థాగత నిర్మాణంలో సంఘం నుండి మండల సమాఖ్య వరకు కట్టుబాట్లలో ప్రతి సభ్యురాలు పాటించేవిధంగా చూడాలి, సంఘం నుండి మండల సమాఖ్య వరకు A గ్రేడ్ సాధించాలి అని తెలియచేయడం జరిగింది. కార్యక్రమానికి గ్రామ సంఘం ప్రతినిధులు, మండల సమాఖ్య ప్రతినిధులు, అకౌంటెంట్, యల్.సి. మునెప్ప, ఏ.పి.యం రమణప్ప, డి.పి.యం.యు నుండి డి.పి.యం_(ఐ.బి) జి.నాగరాజు డి.పి.యం_(యల్.హెచ్ ) పి.రామమోహన్ హాజరు కావడం జరిగింది.
-----------------------
Admin