Friday, 31 July 2026 12:31:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పుల్లలచెరువు మండల కన్వీనర్ పదవి ఎవరికి...?

Date : 23 December 2024 09:49 AM Views : 1143

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు మండలం వైసిపి పార్టీ కన్వీనర్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పటికిని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ప్రజాధరణ తగ్గలేదనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో పలువురు వ్యక్తులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరికివారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చుట్టూ ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మాత్రం మండలంలోని రాజకీయ సమీకరణాలు, బలాబలాలు, బంధు వర్గాలు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి, గతంలో పార్టీ కోసం చేసిన సేవలు తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని మండలి కన్వీనర్ పదవి కోసం వారికి ఉన్న అర్హతను బట్టి కన్వీనర్ పదని ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. మండలంలోని ఒక మహిళ పంచాయితీ సర్పంచి కుమారుడు మండల కన్వీనర్ పదవి కోసం పావులు కదుపుతున్నట్టు మండలంలో బలంగా ఇనిపిస్తుంది. సొంత పంచాయతీలోని వర్గానికి చెందిన ప్రజలకు ఎలాంటి న్యాయము చేయకపోగా వారిని అన్ని విధాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. సొంత పంచాయతీలోని ప్రజల కోసం ఏ న్యాయం చేయలేని వాడు మండల కన్వీనర్ పదవి ఎలా నిర్వహిస్తాడు మండల ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు. ఇదిలా ఉండగా నాయుడుపాలెం ఎస్సీ వర్గానికి చెందిన ఒక యువకుడికి ఎంపీటీసీగా, అవకాశం ఇచ్చినట్లు ఇచ్చి అతని చేత రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి, చేతులెత్తేశాడు. అది కరోనా సమయం కాబట్టి ఎన్నికలు జరగకపోగా, వైసిపి టిడిపి, ఒక నిర్ణయానికి వచ్చి సీట్లు పంచుకున్నారు. అందులో వైసీపీ ఎంపీటీసీ సీటును టిడిపికి ఇచ్చేలాగా లోపాయ కారి ఒప్పందం చేసుకున్నా దీంతో ఆ యువకుడు ఎన్నికల కోసం 2 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఎంపీటీసీగా అవకాశం లేకపోవడం వలన ఆ యువకుడు చాలా బాధపడ్డాడు. అప్పట్లో వైసిపి పార్టీ అధికారంలో ఉంది. ఆ యువకుడు ఖర్చుపెట్టిన 2 లక్షల రూపాయలు ఆ యువకుడికి ఇవ్వమని సర్పంచి కుమారుడికి ఆ డబ్బులు ఇచ్చారు కానీ ఆ డబ్బులు ఆ దళిత యువకుడికి ఇవ్వకుండా స్వాహా చేశాడు. ఆ విషయం తెలుసుకున్న ఆ యువకుడు నా రెండు లక్షల రూపాయలు నాకు ఇవ్వమని అడిగాడు సర్పంచ్ కుమారుడు ఆ డబ్బులు విషయం నాకు తెలియదు నా దగ్గర లేవని అన్నాడు. ఈ విషయము సీనియర్ నాయకులకు చెప్పిన పూలు నాకు ఇప్పించే ప్రయత్నం చేయలేదు. ఆ రెండు లక్షల రూపాయల కోసం వడ్డీలు కట్టలేక నా సొంత స్థలాన్ని అమ్మి తెచ్చిన అప్పులు కట్టాను. అంతేకాదు నాయుడుపాలెం లో అంగన్వాడి పోస్టు లు మూడు కలిపి 10 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అంతేకాదు నాయుడుపాలెం ఎస్సీ కాలనీవాసులకు సర్పంచ్ కుమారుడి వల్ల చాలా అన్యాయం జరిగింది. ఇలా ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది దళితులకు మండలంలో ఎలాంటి న్యాయం జరగలేదు. ఇలాంటి వ్యక్తులకు మండల కన్వీనర్ పదవిని ఇస్ మండలంలోని ఎస్వి సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని పుల్లలచెరువు మండలం దళిత సంఘం నాయకులు కోరుతున్నారు. తాడిపత్రి చంద్రశేఖర్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో మండల కన్వీనర్ పదవిని ఎవరికి కట్టబెడతారో చూడాలి మరి...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: