సర్కార్ టీవీ న్యూస్ / మహబూబ్ నగర్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, మహబూబ్నగర్ రీజినల్ మేనేజర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు రీజినల్ మేనేజర్ శ్రీ పి.సంతోష్ కుమార్ తేదీ06-12-2024 రోజున నాగర్ కర్నూల్ డిపోను సందర్శించారు డిపోలోని అన్ని విభాగములను పరిశీలించి ఉద్యోగులతో సంప్రదించారు అనంతరం డిపో లో ఉద్యోగులను ఉద్దేశించి గేటు మీటింగ్ నిర్వహించి ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ గారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ డిపో ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 2024వరకు 8 కోట్ల లాభంలో ఉందని, ఇంకా మీరందరూ సమిష్టి కృషితో మున్ముందు లాభాలు తేవాలని మరియు ఫేర్ పెయిడ్ ప్యాసింజర్ల సంఖ్యను పెంచాలని కోరారు గ్యారేజీ ఉద్యోగులు బస్సులను తగు జాగ్రత్తలతో మెయింటెనెన్స్ చేసి ఆన్లైన్లో ఫెయిల్యూర్ కాకుండా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీ ఏ యాదయ్య అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్ )శ్రీమతి బాలసరస్వతి మేడం ఎంఎఫ్ శ్రీ భాస్కర్ డిపోలోని ఏడీసీలు గ్యారేజ్ సిబ్బంది డ్రైవర్ కండక్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...
-----------------------
Admin