Thursday, 30 July 2026 11:43:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాజకీయ పార్టీల నాయకులను నిలదీయండి...

Date : 02 November 2023 10:06 AM Views : 332

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం:రాష్ట్రంలో ఎన్నికల జాతర మొదలైందని అమాయక ఆదివాసీ బిడ్డల ఓట్ల కోసం రంగురంగుల జెండాలతో రాజకీయ నాయకులు ఆదివాసీ గూడేల బాట పడతారని ఆదివాసీ హక్కులను కాలరాస్తూ ఓట్ల కోసం వచ్చే నాయకులను నీలాదీయాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం వెంకటాపురం మండల కేంద్రంలోని కొమరం భీమ్ విగ్రహం దగ్గర జి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనం సాయి దొర అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీలకు తీవ్రమైన నష్టం జరిగిందని విద్య,ఉద్యోగ, వైద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలలో తీవ్ర నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ సమస్యల పట్ల వాటి పరిష్కారానికి ఎక్కడా ప్రయత్నించలేదని, ఈ విషయం లో రాష్ట్ర సర్కార్ ఘోరంగా విఫలం చెందిందని ఆరోపించారు. ఈసార్వత్రిక ఎన్నికల్లో పనికిరాని హామీలతో గూడే లలోకి వస్తున్న ప్రధాన పార్టీల నాయకులను ఆదివాసి సమాజం నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఆదివాసుల డిమాండ్లను ఎక్కడ చేర్చలేదని అలాంటప్పుడు ఆదివాసుల ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆయా పార్టీల నాయకులు వస్తున్నారు తప్ప వేరే సమయంలో ఆదివాసుల సమస్యలపై హక్కుల పైవచ్చి అడిగిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదని ఏజెన్సీ ప్రాంతాలలో మారుమూల ఆదివాసి ప్రాంతాలకు మౌలిక సమస్యలు నీటి సౌకర్యం రోడ్లు విద్యా వైద్యం అందకుండా రోగం వస్తే ఆదివాసీలు ఇంకా జడ్డీ లతో రోగులను మోసుకొచ్చే పరిస్థితి ఉండటం సిగ్గుచేటన్నారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఆదివాసీల సమస్యలు ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నాయి ఆదివాసులకు ప్రధాన వనరు భూమి ఆ భూమిని అడవిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తూ వస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉన్న భారత రాజ్యాంగ చట్టాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఆదివాసీలను ఓటు బ్యాంకు గానే వినియోగించుకుంటూ గద్దనెక్కిన తర్వాత ఆదివాసీలకు వ్యతిరేకంగా చట్టాలను సవరణకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోడు భూములకు అరకొర పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండి పడ్డారు. ఈసమావేశంలో కనితి కృష్ణ, చింతామోహన్, జిల్లాఅధ్యక్షులు రేగ గణేష్, మట్టి రమేష్, పూనెం మునేష్ తదితులుపాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: