సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ డివిజన్ పరిధిలోని కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మునిసిపాలిటీలలో కంటి వెలుగు రెండవ టీము, మూడవ టీము పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో , షాద్ నగర్ డివిజన్ డాక్టర్ ఎస్ జయలక్ష్మి, రెండు కంటి వెలుగు టీమ్ లను సడన్ విజిట్ చేశారు. కంటి వెలుగు ప్రోగ్రాం లో రిజిస్ట్రేషన్ పరిశీలించి, ప్రతిరోజు 200 మందికి కంటి పరీక్షలు తప్పక చేయాలని తెలియజేశారు. ఆశాలందరూ కూడా హౌస్ టు హౌస్ వెళ్లి 18 సంవత్సరముల నిండిన వారందరినీ కంటి పరీక్షలకు చేయించుకోవాలని, వాళ్లకు తెలియచేయాలని చెప్పారు. కంటి పరీక్షలు అనంతరము దగ్గర చూపు మందగించిన వారందరికీ కంటి అద్దాలు వెంటనే అందచేయాలని చెప్పారు. దగ్గర చూపు, దూరము చూపు లోపం ఉన్నవారికి ప్రిన్సుప్షన్ గ్లాస్సెస్ కోసము ఆర్డర్ చేయాలని తెలియజేశారు. ఎవరికైతే కాంట్రాక్టు ప్రాబ్లం ఉన్నట్లయితే వారిని ఆపరేషన్ నిమిత్తము సరోజినీ దేవి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, కంటి వెలుగు డాక్టర్, ఆప్తమాలజిస్తే కృష్ణమోహన్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆశాలు పాల్గొన్నారు.
-----------------------
Admin