సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండల పరిధిలో గల కర్ని గ్రామంలో ఎంపిపిఎస్ పాఠశాల ప్రహరీగోడ నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరు కాగా గ్రామస్థులు ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఆయన కొనియాడారు. మన ఊరు మన బడి పనులలో జాప్యం వహించవద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఐ సీతయ్య, సర్పంచ్ అక్రమ్, మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్, మాజీ ఎంపీటీసీ రాధా దత్తురాం , మహమ్మద్ మక్బుల్ , వాకిటి ఆంజనేయులు , గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin