Friday, 31 July 2026 12:01:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రపంచ దేశాలన్నీ యువశక్తి ఆవశ్యకతను గుర్తించాలి...

Date : 13 August 2023 01:28 AM Views : 285

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : విద్య ఉపాధి రంగాలు యువతకు చేరువ కావాలి.... డివైఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ కార్యదర్శి కాలంగి హరికృష్ణ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నేటి సమాజంలో యువత కీలక భాగస్వామ్యం కలిగి ఉండాలనీ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ అన్నారు స్థానిక కొత్తగూడెం క్లబ్లో జరిగిన డివైఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం లీక్కి బాలరాజు సంఘం జిల్లా అధ్యక్షుడు అధ్యక్షతన జరిగింది. యువత శక్తియుక్తులు ఆరోగ్య వంతమైన ప్రపంచానికి బాటలు వేయాలనీ . యువశక్తిని గుర్తించాలనీ . ప్రోత్సహించానీ స్వార్ధం, అవినీతి వంటి జాఢ్యాలు సోకకుండా యువతను తీర్చిదిద్దాలనీ యువత సక్రమ పంథాలో పయనించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందనీ ప్రగతికి, శాంతి, సుస్థిరతలకు పట్టుగొమ్మలు యువతీ యువకులు. యువత ఆలోచనలు సమాజ నిర్మాణానికి తోడ్పాటును అందించగలవనీ యువశక్తి సక్రమంగా వినియోగపడకపోతే ఏ దేశమైనా ప్రగతి పథంలో ముందుకు సాగలేదని. అందుకే యువశక్తి నిర్వీర్యం కాకూడదనీ నిర్మాణాత్మకంగా ఉపయోగపడాలనీ. యవ్వనదశ ఆలోచనా భరితంగా ఉండాలే కాని ఆవేశ పూరితంగా ఉండరాదనీ. యవ్వనదశలో వచ్చే మార్పులను, మానసిక స్థితిగతులను ఉన్నత లక్ష్యాల సాధనకు వినియోగించుకోవాలనీ ,సత్ప్రవర్తన వలనే సమాజ వికాసం సాధ్యం. యువ దశలోనే మానసిక ప్రకోపాలను నియంత్రించుకుని, బాధ్యతా యుతంగా మెలగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనీ యుక్తవయసులో యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కోల్పోయి, తప్పు దారి పడితే సమాజమే తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందనీ. యువత మద్యం, మాదకద్రవ్యాలకు లోను కావడం, తమ విలాసాలకోసం అనైతికమైన పద్ధతుల్లోకి నెట్టబడడం, అసాంఘిక కార్యకాలాపాల వైపు ప్రేరేపించబడడం వలన యువశక్తి నిర్వీర్యమై, విధ్వంస కార్యకలాపాలకు వెన్ను దన్నుగా మారుతున్న సూచనలు అగుపిస్తున్నాయనీ, యువత తప్పుదారిలో పయనించి, దురలవాట్లకు లోనై, సమాజానికి భారంగా మారడం ఆందోళనకరం, దురదృష్టకరం. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై యువతకు అవగాహన కలిగించి, ప్రపంచ నిర్మాణం వైపు యువతను కార్యోన్ముఖులను చేయడం, యువతకు సమస్యలపై పోరాడే బాధ్యత అప్పగించి ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించడం న్యాయ సంబంధమైన సామాజిక ఆర్థిక రాజకీయ సంబంధమైన అంశాల్లో అవగాహన కల్పించడంతోపాటు ప్రపంచాన్ని పురోగమనము వైపు పయనించేటట్టు మార్గం నిర్దేశం చేసి ప్రగతికి బాటలు వేయడమే అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆ రకంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని వారు అన్నారు. నేటి ప్రపంచం అనేక రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నదని నిరీక్షణ నిరుద్యోగం పేదరికం ఆర్థిక అసమానతలు లింగ వివక్షత వంటి సమస్యలతో పాటు ఉగ్రవాదం మాదకద్రవ్యాలు వినియోగం అక్రమ రవాణా హింస శ్రమదోపిడి అత్యాచారాలు అవినీతి బాల కార్మిక వ్యవస్థ లైంగిక హింస వంటివి మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కావలసిన కూడు గూడు గుడ్డ విద్య ఆరోగ్యం వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయని పల్లెలో ఈనాటికీ పారిశుద్ధ్య సమస్యలు తాగునీటి సమస్య వంటి ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయని చాలా దేశాలు తీవ్రవాద సమస్యతో బెంబేలెత్తిపోతున్నాయని సామ్రావాజ శక్తులు బలహీన దేశాలను కబళించడానికి ప్రయత్నిస్తున్నాయని పరుగు దేశాల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇతర దేశాల్లో ఉగ్రవాదానికి సహకరిస్తున్నాయని అనునిత్యం ప్రజల పేదరికంతో బ్రతకలేక నానా వస్తువులు పడుతుంటే ఇదే అదునుగా భావించి కొన్ని దుష్టశక్తులు యువతలోని బలహీనతలను తమకు అనుకూలంగా మలుచుకొని వారిని వివిధ రకాల మాఫియా విషయాల్లోకి మళ్ళించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని యువశక్తి విధ్వంసానికి వినియోగపడితే తద్వారా సంభవించే పరిణామాలు ఊహతీతం ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయని వీటికి తోడుగా మానవ తప్పిదాలతో సృష్టించిన కాలుష్య సమస్య పరిణా పర్యావరణం ప్రకృతి విధ్వంసం ప్లాస్టిక్ సమస్య గ్లోబల్ వార్మింగ్ వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని 1991 వ సంవత్సరం ఆస్ట్రేలియా రాజధాని విఎన్ఆర్ నిర్వహించిన వరల్డ్ యూత్ ఫోరంలో పెద్ద ఎత్తున పాల్గొని యువత తమకోసం ప్రత్యేక అంతర్జాతీయ యువజన దినోత్సవం జరపాలని అభ్యర్థిస్తే ఆ అభ్యర్థనలో 1999లో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించి 2020 సంవత్సరంలో ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవం జరపడం కోసం పిలుపునిచ్చిందని చెప్పేసి అన్నారు ఆ రకంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల ను పరిష్కరించి స్థానికంగాను జాతీయంగానూ అంతర్జాతీయంగాను యువతకు ప్రభావితం చేసి చైతన్యము నింపి వారి ప్రాధాన్యతను పెంచి యువతను ఆయా సమస్యలపై జరిగే పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వాములు చేయడం కోసం ఐక్యరాజ్యసమితి నిర్వహించిందని, ప్రపంచవ్యాప్తంగా యువత సమస్యను పరిష్కరించి యువత ద్వారా నూతన ప్రపంచ నిర్మాణానికి ఒక కార్యచరణ రూపొందించుకోవాలని ప్రపంచ భౌగోళిక పరిస్థి తి పై ,వివిధ ఖండాల ప్రదేశాలపై జరిగే సదస్సులలో ప్రజలందరికీ ఒక సందేశం ఇచ్చారని ,ఒకే జాతి గా మానవత్వం ,స్వేచ్ఛ తో కలిసిమెలిసి జీవించే విధంగా చర్యలు చేపట్టాలని, చాలామంది ప్రజలు విద్యా వైద్యం ఆరోగ్య సదుపాయాల వంటి వాటికి దూరంగా ఉన్నారని ఇదే సందర్భంలో ప్రపంచ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక విషయాలపై సమస్యలపై బయటపడడం కోసం పోరాటాలలో యువత నిర్మాణాత్మక పాత్ర పోషించాలని విద్యా ఉపాధి రంగాలు యువతకు చేరువ కావాలని ప్రపంచ దేశాలన్నీ యువశక్తి ఆవశ్యకతను గుర్తించాలని యువతను మాదక ద్రవ్యాలనుండి కాపాడాలని యువతకు విద్యార్థులకు తమ బాధ్యతను గుర్తు చేసే విధంగా పాఠ్యాంశాలు రూపొందించాలని నవ ప్రపంచ నిర్మాణంలో యువత కీలక బాధ్యత పోషించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని చెప్పి కోరారు సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చందర్రావు వెంకన్న వీరభద్రం మధు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: