Thursday, 30 July 2026 04:02:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పసుపు మయం గా మారిన కొత్తకోట...

Date : 18 October 2022 11:00 PM Views : 647

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : బుక్కపట్నం మండల కొత్తకోటకు విచ్చేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి టీడీపీ కార్యకర్తలు భారీ ఊరేగింపుతో డప్పులు వాయిస్తూ ,టపాసులు పేలుస్తూ యువకులు ,మహిళలు నృత్యాలు చేస్తూ పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండల కొత్తకోట లో మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలను కాపాడు కొనేందుకు తాను జైలుకెళ్లాడానికైనా సిద్ధమే.భవిష్యత్తులో వడ్డీతో సహా వైసీపీకి చెల్లిస్తాం.త్యాగాలకు సిద్ధపడిన కార్యకర్తలకు భవిష్యత్ లో పెద్డపీట 2024 ఎన్నికలే జగన్ కు చివరి ఎన్నికలు *పసుపు మయం గా మారిన కొత్తకోటమాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 32 వైసీపీ కుటుంబాలు మాజీ మంత్రి పల్లె సమక్షంలో టీడీపీలోకి చేరకతెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడరని వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు .బుక్కపట్నం మండలంలోని పి.కొత్తకోటలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 32 కుటుంబాలు వైసీపీ నుంచి పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టిడిపి కండువా వేసుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.*కొత్తకోట పసుపు మయంగా మారింది. గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. వేదిక ఎదుట వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. *అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ఎన్ని కేసులు పెట్టినా దానికి తెలుగుదేశం పార్టీ బెదరదన్నారు. .కార్యకర్తలను కాపాడుకునేందుకు వారికి రక్షణగా నిలిచి తాను జైలుకెళ్లేందుకు సిద్ధమే అని ఆయన కార్యకర్తలను ఉత్సహపరుస్తూ మాట్లాడారు. వైసిపి నేతలు ఎన్ని కేసులు పెట్టినా భవిష్యత్తులో వడ్డీతో సహా వైసిపికి చెల్లిస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు టిడిపి కార్యకర్తలు ఎన్నడూ భయపడరని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న టీడీపీ కి అండగా నిలిచి కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు త్యాగాలు వృథా కావని అన్నారు. త్యాగాలకు సిద్ధపడిన కార్యకర్తలకు భవిష్యత్తులో పెద్దపీట వేస్తామని.అన్నారు. 2024 ఎన్నికలే జగన్ కు చివరి ఎన్నికలు కానున్నాయని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జోస్యం చెప్పారు. అమరావతి రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న రైతులను అడ్డుకుంటే జగన్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని హెచ్చరించారు. కొత్తకోట గ్రామం టిడిపికి కంచుకోటగా మారనుందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారు. కోత్తకోట నుంచి నార్సింపల్లి కి, మదురేబైలు కు ,యర్లం పల్లి నుంచి నార్సింపల్లి కి రహదారి ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారు. తలారి చిన్న కేశవప్ప, కృష్ణయ్య ,చంద్రప్ప ,సన్నప్పయ్య, కదిరిగాని రాము ధూపం పల్లి కేశప్ప,చెన్నప్ప, కుళ్లాయప్ప, సాకే చిన్నికృష్ణ అనిత, శేషం నల్లప్ప ,బిట్ర గుంటపల్లి నాగేంద్ర ,శివమ్మ, మంగమ్మ, రాధమ్మ తదితర కుటుంబాలు టీడీపీలోకి చేరారు.మాజీ మంత్రితోపాటు టీడీపీ మండల కన్వీనర్ మల్లి రెడ్డి ,టీడీపీనాయకులు సుబ్బారెడ్డి ,సామకోటి ఆదినారాయణ ,గంగాధర్ ,రవీంద్ర ,నారాయణమ్మ ,లావణ్య ,గోపాల్ ,బాలు ,గూనిపల్లిరవీంద్రారెడ్డి, రవిచంద్రారెడ్డి ,వెంకట్రాముడు , స్థానిక టిడిపి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: