సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోతె మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో పాఠశాల ఆవరణంలో, రామాలయం, కాటమరాజు గుడి మరియు పల్లె ప్రకృతి వనంలో మొక్కలను నాటుతూ జీవవైవిద్య అభివృద్ధి కొరకు ఐటిసి మరియు గ్రీన్ క్రాస్ సంస్థలు కృషి చేస్తున్నాయని అందులో భాగంగా గ్రామంలోని మొక్కల పెంపకం చేపడుతున్నామని దీని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటలనీ గ్రీన్ క్రాస్ సంస్థ మండల ఆర్గనైజర్ భూక్య వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమానిలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, పంచాయితీ కార్యదర్శి రేణుక మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నుండి గ్రామంలో అనేక మొక్కలు నాటుతున్నారని దీనిమీద అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ నాటిన ప్రతి మొక్కను పెంచే విధంగా సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. పచ్చదనం-స్వచ్ఛదనం కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ ఐటిసి వారు గ్రీన్ క్రాస్ సంస్థ వారు మొక్కలను అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది మల్లయ్య, అంగన్వాడి టీచర్ పార్వతి, మాజీ సర్పంచ్ గంగులు, గ్రామ పెద్దలు నరసయ్య, లింగమ్మ తిరుపతయ్య, మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin