సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ అడ్వకేట్ యెర్రా కామేష్ అన్నారు.ఆదివారం పట్టణం లోని ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ హాల్ నందు అసెంబ్లీ అధ్యక్షుడు చెనిగరపు నిరంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందించడంలో అదేవిదంగా కనీస అవసరాలైన విద్య,వైద్యం అందించడంలో పాలకులు పూర్తిగా విపలమవుతున్నారని విమర్శించారు.జనాభాలో 90 శాతానికి పైగా ఉన్న బహుజనుల హక్కులను, స్వేచ్ఛను అగ్రవర్ణ పాలకులు కాలరస్తున్నరని ఆరోపించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 జనరల్ అసెంబ్లీ స్థానాల్లో బహుజనులకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందనీ,భవిష్యత్తులో జరగనున్న పార్లమెంట్,ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటినుండే సమాయత్తం కలవాలి కోరారు. రాష్ట్ర అధ్యక్షులు ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో అత్యధిక ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కొరకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు, జిల్లా మహిళా కన్వీనర్ ఎర్రంశెట్టి రాజేశ్వరి, సాయి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగుల రవికుమార్, మాలోత్ వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin