సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మణిపూర్ లో జరిగిన జాతుల ఉద్యమంలో మహిళలను వివస్త్రాలను చేసి అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మణిపూర్ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దుచేసి రాష్ట్రపతి పాలనను విధించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నాడు షాద్ నగర్ పట్టణంలో జరిగిన సిపిఐ నియోజకవర్గ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత సమాజం తలదించుకునే విధంగా దుండగులు మహిళలను వివస్త్రాలను చేసి ప్రదర్శన చేయడం సామూహిక అత్యాచారం చేయడం ఆటవిక పాలనను గుర్తు చేస్తుందని అందుకోసమే మణిపూర్ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ నియోజకవర్గ పార్టీ కన్వీనర్ పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ.. నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జూలై 25న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పూరి గుడిసెలు ధ్వంసమైన రోడ్ల ను బాగు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన తెలిపారు పార్టీని ప్రజాసంఘాలను గ్రామాలకు విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్ధుల గంగయ్య, ఎం శ్రీను, మండల కార్యదర్శి ఎం గోవిందు నాయక్, ఎండి షకీల్, గడ్డం జంగయ్య, చెన్నయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎం పవన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin