సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : ఆగస్టు 25 న హైదరాబాద్ లో జరిగే యాదవ యుద్ధభేరి సభ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలనీ కోరుతూ పాల్వంచ ఆత్మలింగేశ్వర ఆలయంలో వల్లపు యాకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్ట్ అడ్వకేట్ చలకాని వెంకట్ యాదవ్ తో కలిసి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చా.శ్రీనివాసరావు , యాదవ విద్యా వంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు యాదవులు, యాదవ ఉపకులాలకు 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 5 ఎంపి. సీట్లు ఇవ్వాలని, జన గణనలో కులగణన వెంటనే చేపట్టాలని, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్ర బడ్జెట్లో యాదవులకు 18% నిధులు కేటాయించాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలని, యాదవులు, యాదవ ఉపకులాలకు ఎస్.ఎన్.టి రిజర్వేషన్లు ఇవ్వాలని, యాదవుల విద్యా, ఉద్యోగ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు పరమేశ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోదాడ.శ్రీనివాస్ యాదవ్, సీనియర్ యాదవ సంఘం నాయకులు లాయర్ రామచంద్రరావు,నరిగ. రమేష్,గంటా. సత్యనారాయణ, కుక్కల.సాంబయ్య,ఆవుల.శ్రీనివాస్,మారగం.గురవయ్య, మారగం. అంకయ్య,కూరాకుల.వెంకన్న, ఐలయ్య,వెంకటేశ్వర్లు,బాష్కర్, దయాకర్,సతీష్, లింగరాజు, రాధాకృష్ణ,ధర్మయ్య,యాదవ విధ్యా వంతుల వేదిక కమిటీ సభ్యులు మరియు జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin