Friday, 31 July 2026 01:36:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పిల్లుట్ల రఘు గెలుపు హుజూర్ నగర్ అభివృద్ధికి మలుపు...

Date : 15 November 2023 02:55 AM Views : 320

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం పలు వార్డుల్లో విస్తృత పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు గడపగడప తిరుగుతూ భరోసానిస్తూ ప్రజల సమస్యలు వింటూ సింహం గుర్తు ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరుస్తానన్నారు.. ప్రజలు కూడ మద్దతుని తెలిపి సింహం గుర్తుకే ఓటు వేయాలని కోరారు. మహిళలు కూడా ఇటువంటి నాయకుడే ఎమ్మెల్యే కావాలి అనడం సమంజసం.. ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలకు ఓడిపోతామని భయం పట్టుకుందని, తనపై అమ్ముడుపోయాడని దుష్ప్రచారలు,అసత్య ప్రచారాలు చేస్తున్నారని కుమ్మక్కయి అమ్ముడుపోయే బ్యాచులు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు అని ఎవరేన్ని అసత్య ప్రచారాలు చేసిన ఒంటరిగా సింహం గుర్తుతో ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు. తాను స్వచ్ఛమైన ప్రజా సేవలు చేస్తుంటే, అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, అవినీతి పాలనలు,స్వార్ధ పాలనలు చేస్తూ అల్ప సంతోషం పడుతున్నారన్నారు . నియోజకవర్గంలో తను ప్రజా సేవలు చేస్తుంటే వారు భూకబ్జాలు, రౌడీయిజం, గుండాయిజం, పేకాట రాయలను పోషిస్తున్నారని, ప్రజల ఓట్లతో గెలిచి వారిని పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నారని ఇటువంటి నాయకులకు ప్రజలు అవకాశం ఇవ్వవద్దని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి నియోజవర్గం నుంచి తరిమివేయాలని అన్నారు. పనికి పనిచేసుకొని బ్రతికే వాళ్ళ ఇళ్లను కూల్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని, ప్రజలు కిరాయి ఇళ్లలో బిక్కు బిక్కు మంటూ బతకవలసి వస్తుందని ఇన్ని రోజులు ప్రజల్ని పట్టించుకోకుండా అధికారం అనుభవించి ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసరికి మన ఇంటికి వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పార్టీలు మనలో మనకు గొడవలు పెడతాయని, కేసులు పెడతాయని, పార్టీలను, పార్టీనాయకులను నమ్మవద్దని అన్నారు..పార్టీలకు కొమ్ములు కాసేవారికి ప్రభుత్వ పథకాలు దళిత బంధు,రైతుబంధు అన్ని వారికి అందుతున్నాయని సామాన్యుల పరిస్థితి దుర్భరంగా తయారైందని అన్నారు.తనని సింహం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్ఛమైన ప్రజాపాలనను చేసి చూపెడతానన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదవారందరికీ కొత్త ఇల్లు నిర్మిస్తానన్నారు.. ఒకరు నియోజకవర్గాన్ని నేనే అభివృద్ధి చేశానని, మరొకరు 3500 కోట్లతో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని అంత గొప్పగా అభివృద్ధి చేస్తే నియోజవర్గం దుమ్ముదులితో, రోడ్లన్నీ గుంతలతో నిండి ఉన్నాయన్నారు.. నీటి వసతిని రోడ్డులు పట్టించుకోని ఈ నాయకులు ప్రజలను ఎలా పాలిస్తారని పిల్లుట్ల రఘు అన్నారు.. నియోజవర్గంలో ప్రజలందరూ మార్పును కోరుకొని నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలను ఆదుకున్న తనను సింహం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రతి కుటుంబానికి అండగా ఉండి ప్రతి ఒక్కరి సమస్య ఊరి సమస్యను తీరుస్తానన్నారు. గత మూడు సంవత్సరాల కాలం నుంచి విద్య వైద్య ఆర్థికంగా ఆదుకుంటూ, నిరుద్యోగులకు భరోసానిస్తూ, అనేక పాఠశాలలను పునర్నిర్మాణం తాగునీటి వసతి కోసం అనేక బోర్లు వేయించాము అని అన్నారు. కొన్ని ఊర్లోలో అంబేద్కర్ విగ్రహాలు, మేరీ మాడియా గుడిలనూ నిర్మించి అన్ని కులలు,మతాలకు సహాయ సహకారాల నుంచి, పండగలను అందరు కలిసిమెలిసి చేసుకునేలా ఒక నూతన సంప్రదాయ ఒరవడని సృష్టిం చారు.కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు దీటుగా తాను కూడా సొంత మేనిఫెస్టోను పెట్టానని ఎమ్మెల్యే గెలిచి అధికారంలోకి రాగానే రెండు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క సమస్యను తీరుస్తానన్నారు.ప్రజలందరూ సహకరించి సింహం గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని పిల్లుట్ల రఘు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ఎఐఎఫ్ బి పార్టీ సింహం గుర్తు కార్యకర్తలు, రఘు అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: