సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : టిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని... బీఆర్ఎస్ యువ నాయకులు వై. మురళీకృష్ణ యాదవ్, పిలుపునిచ్చారు... షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల్ ఇన్ముల్ నర్వ గ్రామంలో గ్రామ యువకులు, సల్ల యాదగిరి రషీద్, శిరజ్ ఎన్ రమేష్ యాదవ్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి పలువురు యువకులు, యువజన సంఘాల నాయకులు ఇతర పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువతకు గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజక వర్గంలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందుతారని వారు అన్నారు. ఎన్నికలు అయ్యేదాకా యువత పెద్ద ఎత్తున పార్టీ ప్రచారం చేపట్టాలని ప్రతి కార్యకర్త సైనికుడిలా మారాలని అన్నారు. ఎర్రోళ్ల బాలరాజ్, లక్ష్మయ్య, పెంటనోళ్ల బాల్రాజ్, కుక్కల మల్లేష్, సురేష్, రవి, శేఖర్, బైండ్ల ప్రవీణ్, ఎర్రోళ్ల అవినాష్, రాఘవేందర్, పెదరగల్లా శివకుమార్, పవన్, పాండు, చందు, నరేష్, బైండ్ల అశోక్, మహేందర్, రాజు, కరోల్ల బబ్లు, కరోల్ల ప్రభాకర్, మురళి అన్న ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద గళ్ళ రవీందర్, పెద్దరగల రవి, ఎర్రోళ్ల శేఖర్, ఎర్రల జంగయ్య, ఎర్రల నరసింహ పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin