Thursday, 30 July 2026 05:01:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ బిజెపి మీడియా సమావేశం... - బిజెపి రాష్ట్ర యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి

Date : 29 September 2023 05:56 AM Views : 468

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు పర్యటనలో భాగంగా 2023 ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుండి ఎన్నికల శంకరాల పూరించబోతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువనాయకులు ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. గురువారం షాద్ నగర్ బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ఋషికేష్, సీనియర్ నాయకుడు మల్చాలం మురళి, గడియారం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాలో నిర్వహించే బహిరంగ సభకు షాద్ నగర్ మున్సిపాలిటీ ఇన్చార్జిగా తనను నియమించారని చెప్పారు. ప్రధాని మోడీ సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా ఆయన అభివర్ణించారు. బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ నాయకులు తీసుకున్నారని చెప్పారు. ఈ బహిరంగ సభకు కనీసం లక్షన్నర మందిని తరలించేలా జన సమీకరణపై దృష్టిపెట్టామని వివరించారు. షాద్ నగర్ మున్సిపాలిటీ ప్రాంతం నుండి కనీసం 15000 మందిని సభకు తరలిస్తున్నట్టు చెప్పారు. మిగతా మండలాలకు ఇంకా ఇతర నాయకులు ఇన్చార్జిలుగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మోడీ సభతో కెసిఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని అన్నారు. రాష్ట్రంలో కేసిఆర్ పాలన అవినీతిమయం అయిందని అన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ చరిష్మా కొనసాగుతుందని అన్నారు. దీనికి నిదర్శనమే జి20 దేశాల సదస్సు ఇక్కడ నిర్వహించడం అని అన్నారు. నరేంద్ర మోడీ విశ్వ గురువుగా పేరుపొందాలరని ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమ పాలనను బిజెపి ఎండకడుతుందని అన్నారు. కేసీఅర్ తో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. యువత పెద్ద ఎత్తున కదిలి తరలిరావాలని అన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని డబుల్ ఇంజన్ సర్కార్ తో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రజలకు చేర్చి చిరస్థాయిగా చరిత్రలో బిజెపి నిలిచిపోతుందని అన్నారు. మోడీ సభకు పెద్ద ఎత్తున అభిమానులు ప్రజలు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: