Thursday, 30 July 2026 08:36:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అరెస్టులతో ప్రశ్నించే గొంతుకులను ఆపలేరు...

Date : 19 January 2023 12:29 AM Views : 852

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని, అరెస్టులతో ప్రశ్నించే గొంతుకులను ఆపలేరని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బయల్దేరి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీస్ లు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనే అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సంద్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ. పోలీస్ లు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్చగా మాట్లాడుకునే హక్కు, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే అనిచి వెసి ఉంటే కేసీఆర్ పరిస్థితి ఏమై ఉండేదో ఆలోచించాలని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కు ప్రజా సమస్యలపై కనీసం మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. కోటాను కోట్ల రూపాయల ప్రజా ధనం పార్టీ బహిరంగ సభలకు ఖర్చు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని అన్నారు. నిరంకుశ పాలనకు కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్ని నిర్బంధాలు చేసిన ఎన్ని కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యలపై పోరాటాలకు వెనకంజ వేయదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, పాలేరు నియోజకవర్గ పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, పీసీసీ సభ్యులు వడ్డే నారాయణ, ఖమ్మం నగర కార్పోరేటర్ మిక్కిలినేని మంజులానరేందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు తోటకూర రవిశంకర్, ఖమ్మం నగర కార్పోరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, ఏలురి రజినీ, దేవత్ దివ్య, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ మహమూద్, బండి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: