సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మండలం : ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరుగు సమ్మె మరియు గ్రామీణ భారత్ బంద్ లో మధ్యాహ్న భోజన కార్మికులు కూడా పాల్గొంటున్నారని మాగనూర మండల ఎంఈఓ ఆఫీసులో ఎం ఐ ఎస్ మండల కోఆర్డినేటర్ నరేష్ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది సిఐటియు జిల్లా జిల్లా కో కన్వీనర్ పుంజునూర్ ఆంజనేయులు మరియు మధ్యహ్న బోజన పథకం కార్మికుల యూనియన్ మాగనూర్ కృష్ణ మండలాల మండల అధ్యక్షులు జి ప్రమీల లక్ష్మీ దేవమ్మ మహిమద సమ్మే నోటీసు శనివారం రోజుఅందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు మూడు నాలుగు నెలలవి అదేవిధంగా గుడ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అదేవిధంగా పెంచినటువంటి మూడు వేల వేతనం ఏరియర్స్ తో సహా కలిపి వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు మధ్యాహ్నం భోజనం పథకం లో పనిచేస్తున్న కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని,కోడి గుడ్లను ప్రభుత్వమే సరఫర చేయాలన్నారు.కార్మికులకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మే ను మండల కేంద్రాలలో మధ్యాహ్న భోజన కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను కోరారు ఆరోజు పాఠశాలలో వంట బంధు ఉంటుందని తెలిపారు. సమ్మె నోటీసు అందజేసిన వారిలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకురాలు ఉమాదేవి రాధా చేగుంట మల్లమ్మ బాబు మహదేవమ్మ తదితరులు ఉన్నారు
-----------------------
Admin