సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచనల మేరకు హరితహారం వజ్రోత్సవ ముగింపు సందర్భంగా 31, 500 మొక్కలు నాటాలని, మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నాటాలని మండల ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ మఠంపల్లి మండలం ఎర్రగట్టు, మఠంపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని , మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతున్నందున పర్యావరణాన్ని సంరక్షించేందుకు మొక్కలు నాటాలని ఈ బృహత్కర కార్యక్రమమునకు జడ్పిటిసి, ఎంపిటిసిలు , సర్పంచులు, అధికారులు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ,వార్డు సభ్యులు, ప్రజలు భాగ్యస్వాములు కావాలని,సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి రాములు, ఎం పి ఓ ఆంజనేయులు, ఏపీవో ఉమా, సర్పంచ్ బేత విజయ కుమారి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, గ్రామపంచాయతీ కో ఆప్షన్ మెంబర్ సురేష్ గౌడ్, టిఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యదర్శి, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin