Saturday, 01 August 2026 12:00:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మా కష్టార్జితమే నీకు ఎమ్మెల్యే పదవి...

Date : 08 February 2023 11:00 PM Views : 661

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వైరా నియోజకవర్గంలో మాపై ప్రజలకున్న విశ్వాసం, నమ్మకమే ఎమ్మెల్యే రాములు నాయక్ గెలుపుకు కారణమని, తక్షణమే ఆ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే గెలవాలని మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ సవాల్ విసిరారు. బుధవారం వైరాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమకు పదవులు అయోచితంగా, ఊరికే రాలేదని, తమ శ్రమను గుర్తించి మా కష్టార్జితంతోనే వచ్చాయని గుర్తుచేశారు. ఆనాడు రాములు నాయక్ అంటే నియోజకవర్గ ప్రజలకు తెలియదని, తమ పట్ల విశ్వాసం, జనామోదం ఉండటం వల్లే పొంగులేటి శ్రీనివాస రెడ్డి కృషితో రాములు నాయక్ గెలుపొందారన్నారు. అంత దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవా లన్నారు. అమెరికాలో ఉండి జోడు పదవులు తెచ్చుకున్న తాత మధు తన పదవులను కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నారని, ఈసారి ఎన్నికల్లో శ్రీనివాస రెడ్డి మీద పోటీచేసి డిపాజిట్ తెచ్చుకుంటే రాజకీయాల నుండి తాము శాశ్వతంగా తప్పుకుంటామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఛరిస్మ, జనహృదయనేత అని, జిల్లాలో ఎన్నో కుటుంబాలను ఆపదలో ఆదుకున్నారన్నారు. వైరా నియోజకవర్గంలో విజయబాయిని అభ్యర్థిగా ప్రకటించగానే బీఆర్ఎస్ నాయకుల్లో వణుకు ప్రారంభం అయిందన్నారు. ఎమ్మెల్యే ఆస్తులు శ్రీనివాస రెడ్డి రాయించుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యేకు చదువు రాదా. అని ఎదురు ప్రశ్నించారు. తాము విలువలతో కూడిన, స్నేహపూర్వక రాజకీయాలే చేశామన్నారు. మీలా నాలుగేళ్లు వాడుకొని ఇలా ఆరోపణలు చేయటం బాధాకరమన్నారు. ఈ మాటలన్నీ నాలుగుగోడల మధ్య పోలీస్ బందోబస్తు నడుమ అన్నారు కాబట్టి బ్రతికిపోయారని, అదే గ్రామాల్లో, జనాల్లో అంటే ఆ పరిణామం వేరే తీరుగా ఉండేదన్నారు. ఈ నెల 15వ తేదీన వైరాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ సూతకాని జైపాల్, బీఆర్ఎస్ నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: