సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ అక్షర చిట్ ఫండ్ ఘరానా మోసాలకు పాల్పడుతున్నారని కొందరు కాతదరు తెలిపారు .పాల్వంచ కరకవగు గ్రామానికి చెందిన అట్ల నరేష్ అనేవ్యక్తి డిసెంబర్ 2020 లో ప్రారంభించి నవెంబర్ 2022 లో చిట్టి పడుకున్నారు డిసెంబర్ నెలలో వాడుకున్న డబ్బులు ఇవ్వాల్సిందే ఉండగా నేటికి ఆరు నెలలు గడిచిన ఇవ్వని పరిస్థితి నెలకొంది ఈ ఆరు నెలలుగా ప్రతిరోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడుసార్లు అక్షర చిట్టిఫండ్ ఆఫీసుకు వచ్చి నా యొక్క డబ్బులు నాకు ఇవ్వమని చెప్పగా రేపు మాకు అంటూ నేటికీ ఆరు నెలలు గడిచిన ఇప్పటివరకు డబ్బులు ఇవ్వకుండా మేనేజర్ ఆఫీస్ కి రాకుండా సిబ్బందిని అడిగితే సమాధానం చెప్పకుండా రోజు ఇలా తిప్పించుకుంటున్నారు నేను కూలి పని చేసుకునే ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయని అక్షర చిట్ ఫండ్ ను నమ్ముకుని చిట్టి కట్టుకున్న నని బుధవారం అక్షర చిట్ ఫండ్ ఆఫీస్ కొచ్చి అడగగా సరైన సమాధానం చెప్పకపోవడంతో నిసిగెత్తిపోయి ఏం చేయాలో అర్థంకాక ఆఫీసుకు తాళాలు వేసానని తెలిపారు. ఇప్పటికీ రెండుసార్లు తాళాలు వేసినప్పటికీ అక్షర చిట్ ఫండ్ తీరు మారటం లేదని అన్నారు. మా పాప ఫంక్షన్ కోసం నాకు లక్ష 30 వేల రూపాయలు ఇవ్వాల్సిందే కనీసం 50,000 అయినా ఇవ్వమని ప్రాధేయపడిన మాకు సంబంధం లేదన్నట్టుగా ఆఫీస్ సిబ్బంది మేనేజర్ చెప్తున్నారు నా యొక్క డబ్బులు నాకు చెల్లించకపోతే నేను మా భార్య పిల్లలతో కలిసి అక్షర చిట్ ఫండ్ ఆఫీస్ ముందు పురుగుల మందు తాగి చనిపోతామని తెలిపారు కావున మాకు న్యాయం జరిగేలా చూడాలని మీడియా సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు...
-----------------------
Admin