సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండలం అల్లిపాలెం చెంచు గూడాలను సందర్శించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సార్య గారు. ఎర్రగొండపాలెం మండలం గంజి వారి పల్లి పంచాయతీ అల్లిపాలెం చెంచుగూడెంలో షార్ట్స్ సమస్త ఆధ్వర్యంలో 26 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రకాశం భవనమును గురువారం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అనుసార్య, మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సహదేత్ వెంకట త్రివి నాగ్ తో కలసి ప్రారంభించారు. అనంతరం బాల ప్రకాశం భవనమును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంత చెంచుల జీవన ప్రమాణాలు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సాడ్స్ సమస్త కృషి అభినందనీయమన్నారు. చెంచుల జీవన ప్రమాణాలు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జన్ మన్ కార్యక్రమం కింద అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుచున్నాయి అన్నారు. అల్లిపాలెం చెంచుగూడెంలో కలెక్టర్ పర్యటించడం జరిగింది. చెంచులు మాకు పక్కా వసతి గృహాలు ఏర్పాటు చేయాలి, మా పిల్లలు చదువుకోవడానికి వసతి గృహాన్ని చేయాలి ఇంకా సమస్యలు కలెక్టర్ దృష్టికి తేవడం జరిగింది. కలెక్టర్ చెంచులు అడిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంజి వారి పల్లి సర్పంచ్ సుబ్బారెడ్డి ఎంపీడీవో శ్రీనివాసరావు, తాసిల్దార్ బాలకిషోర్ శాఖల అధికారులు పాల్గొన్నారు....
-----------------------
Admin