Thursday, 30 July 2026 11:43:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

న్యాయవాది ముకుంద్ రాజ్ మృతికి సంతాపం...

Date : 09 January 2024 07:44 AM Views : 279

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న తగిరేకర్ ముకుంద్ రాజ్ (63) మృతికి కొత్తగూడెం న్యాయ వ్యవస్థ సంతాపం ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున మృతి చెందిన ముకుంద్ రాజ్ మృతికి 'ఫుల్ కోర్ట్ రెఫరెన్స్' పాటించారు. కొత్తగూడెంలోని వివిధ కోర్టుల్లో పని చేస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ ఈ రోజు ఉదయం జిల్లా కోర్టు హాలులో సమావేశమై ముకుంద్ రాజ్ కు సంతాపం ప్రకటించారు. ముకుంద్ రాజ్ జీవిత విశేషాలు తెలుపుతూ కొత్తగూడెం రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బి.కాం. ఏలూరు లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారని, ఆయన సహచరులు ఇరువురు హై కోర్టు న్యాయమూర్తులుగా ఉన్నారని, ఆయన ఎల్.ఐ.సి., ప్రయివేట్ చిట్ ఫండ్ తరపున ప్యానెల్ అడ్వకేట్ గా పనిచేశారని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ కుమార్ మక్కడ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి వసంత్ పాటిల్ మాట్లాడుతూ ముకుంద్ రాజ్ అత్యంత సౌమ్యుడని, న్యాయ వ్యవస్థలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ముకుంద్ రాజ్ మృతికి సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి జిల్లా జడ్జి వసంత్ పాటిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్ నివాళులు అర్పించారు. ఈ కార్య క్రమంలో న్యాయమూర్తులు షాం శ్రీ, జి. భానుమతి, బి.రామారావు, సుచరిత, బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు దుండ్ర రమేష్, రావిలాల రామారావు, సాహు సంతోష్ లాల్, సాంస్కృతిక కార్యదర్శి పిట్టల రామారావు, గ్రంథాలయ కార్యదర్శి యాస యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :