సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : ఈనెల 29న హుజూర్ నగర్ పట్టణ పరిధిలో ఉన్న మేళ్ళ చెరువు రోడ్డు నందు శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న తెలంగాణ తొలి మలి దశఉద్యమకారుల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పిఎస్ సిఎస్ చైర్మన్ వీరoరెడ్డి శంబిరెడ్డి అన్నారు . గరిడేపల్లి మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ 2001 నుండి మలిదశఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మలిదశ ఉద్యమకారులు పాల్గొని తెలంగాణ ఉద్యమంలో మనం పోషించిన పాత్రను ప్రత్యేకంగా వివరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హాజరవుతున్నారని నియోజకవర్గంలో ఉన్న ప్రతి యొక్క మలిదశ ఉద్యమకారుడు ఈ కార్యక్రమంలో పాల్గొని మన బాధల్ని మనం గౌరవ శాసనసభ్యులతో పంచుకోవాలని వారు ఉద్యమకారులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిడమర్తి అంజి అప్పన పేట ఎంపిటిసి కడప వెంకన్న మాజీ సర్పంచ్ బానోతు వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు బోల్ల గాని సైదులు ఎల్లవుల గురుమూర్తి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin