సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం నియోజకవర్గంలో నెలకొని ఉన్న ముస్లింల సమస్యలను పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా స్థానిక శాసన సభ్యులు తెల్లం వెంకట్రావును సోమవారం నాడు కోరారు. తొలుతగా స్థానిక ముస్లింలతో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం భద్రాచలం పట్టణంలో గల పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందించారు. అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో గత 20 ఏళ్ళు గా ముస్లింల షాదిఖానా శిధిలవస్థలో ఉన్నదని పట్టణానికి దూరంగా ఉన్నందున షాదీఖానా కొరకు నూతన స్థలాన్ని కేటాయించి నిర్మాణం చేపట్టాలని కోరారు. భద్రాచలం పట్టణంలో ముస్లిం స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని అదే విధంగా మైనారిటీ గురుకుల పాఠశాలకు కేటాయించిన స్థలంలో పక్కా భవనాల నిర్మాణాలకు ప్రయత్నించాలని నియోజకవర్గంలో ముస్లింలకు మంజూరు అయిన కుట్టుమిషన్లు వెంటనే విడుదల చేసేవిధంగా తగుచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మైనారిటీ నాయకులు షేక్ రబ్బానీ, సర్వర్ మియా, జాకీర్ హుస్సేన్, ఇబ్రహీం, రియాజ్, సలావుద్దిన్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin