సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కలెక్టరేట్: మధ్యాహ్న భోజన కార్మికులకు జీఓ నెంబర్ 8 ప్రకారం పెంచిన వేతనాలు ఏరియర్స్ తో చెల్లించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద 9వ రోజుకు చేరుకున్న మధ్యాహ్న భోజన భోజన కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ జీఓ నెంబర్ 8 ప్రకారం వంట కార్మికులకు పెంచిన రూ.2000 తో కలిపి వేతనాలు రూ.3000 అసెంబ్లీలో ప్రకటించిన తేదీ :15-02-2022 నుండి ఏరియర్స్ తో చెల్లించాలని,పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని,కొత్త మెనూ ప్రకారం రేట్లు పెంచి బడ్జెట్ కేటాయించాలని,వంట సరకులతో పాటు గ్యాస్ సిలిండర్ల్,వంట పాత్రలు కోడిగ్రుడ్లు ఇవ్వాలని,ప్రమాద బీమా సౌకర్యం,గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని,పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు.వంట కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం,పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,సతేనపల్లి విజయలక్ష్మి,దాసుల పుష్ప,బాధిలా మంగ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin