సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని బహుజన్ సమాజ్ పార్టీ పూరిస్తుందని ఇక తాడోపేడో తేల్చుకుని తీరుతామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ స్పష్టం చేశారు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ భరోసా సభకు హైదరాబాద్ బయలుదేరుతున్న సందర్భంగా పార్టీ జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు బస్టాండ్ సమీపంలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ కు చేరుకొని పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాజ్యాధికారం దిశగా బీఎస్పీ ఆలోచనలు చేస్తుందని చెప్పారు అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ముఖ్యఅతిథిగా జరిగే తెలంగాణ భరోసా మహాసభతో బీఎస్పీ పూర్తిస్థాయిలో రానున్న ఎన్నికలకు సర్వం సన్నద్ధం అవుతుందన్నారు రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు భవిష్యత్తు తరాలకు భరోసా కల్పించాలంటే ఒక్క బహుజన్ సమాజ్ వాది పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు ఈ దఫా తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీసీలు ఎస్సీలు,ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణ పేదలను అక్కున చేర్చుకునే విధంగా ముందుకు సాగుతామని వివరించారు ఆ దిశగా అడుగులు వేయడంతో పాటు విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ముందుకు సాగుతామని అన్నారు ఎన్నికలు అనగానే టక్కు టమారా విద్యలతో కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తాడని ఇలా రెండు పర్యాయాలు చేయగలిగాడని కానీ ఈసారి ఎవరున్నా లేకున్నా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో వీటిని అడ్డుకొని తీరుతామని తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని నిరూపిస్తామని స్పష్టం చేశారు అనంతరం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి వేలాదిగా వాహనాలలో హైదరాబాదులోని సరూర్నగర్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళ్లారు ఈకార్యక్రమంలో సాయి,స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి హరిబాబు,నాగుల రవికుమార్,కోలా మల్లికా,బండి రమణి,కోళ్లపూడి ప్రవీణ్ కుమార్,కేతిని కుమారి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin