సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వెలిశాల కోటేశ్వరరావు మార్కాపురం డి.ఎస్.పి బాల సుందరావును మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వెలసిల రావు మాట్లాడుతూ డిఎస్పి బాలసుందర్రావు గారితో ఎస్సీ ఎస్టీల కు జరుగుతున్న అన్యాయం గురించి అలాగే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ దళితులు స్వచ్ఛందంగా స్వతంత్రంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేలాగా చూడాలని ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందుగానే గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని నిజాయితీగా స్వతంత్రంగా ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునేలాగా పోలీసు యంత్రాంగం వారికి రక్షణగా ఉండి రాబోయే ఎన్నికల్లో నిజాయితీగల నాయకుడిని వెన్నుకునేలాగా హక్కు వినియోగించుకున్న లాగ చూడాలని డీఎస్పీ గారిని కోరడం జరిగింది. డిఎస్పి గారు స్పందించి ఎక్కడైతే సమస్య ఆత్మకంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఎస్సీ ఎస్టీలకు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే లాగా చేస్తామని అయితే జిఎస్టి దళితులకు భయపెట్టడం వారి ఓటు హక్కును కాలరాస్తున్న వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నేను చెప్పడం జరిగింది.
-----------------------
Admin