సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణం లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ, కరుణ, మానవత్వాన్ని ప్రపంచానికి పంచిన ఆ యేసు జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలసి ఈ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు... అలాగే మిర్యాలగూడ నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డిసిసి అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ సీనియర్ నాయకులు పాల్గొన్నారు..
-----------------------
Admin