సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, నందిగామ మండల్ : పల్లెల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడం కోసమే గ్రామ గ్రామాన పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని చాకలిదానిగుట్ట తండా, రంగాపూర్, మేక గూడ గ్రామాలలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. పల్లె బాట కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తెలుసుకున్న ప్రతి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి పల్లెలో నెలకొన్న సమస్య లను పరిష్కరించి ఆదర్శ గ్రామాలుగా మారుస్తానన్నారు. పల్లెల అభివృద్ధిలో గ్రామస్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా వికలాంగులకు ఉచిత బస్ పాసులు అందజేశారు.
-----------------------
Admin