సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట పట్టణం వరంగల్ రోడ్ చౌరస్తా దగ్గర మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తగ్గించి చేసిన సందర్భంగా నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ మరియు రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొని నరేంద్ర మోదీ చిత్రా పటానికి పాలాభిషేకం చేశారు అనంతరం రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పేదల రైతుల విద్యార్థుల మధ్యతరగతి కుటుంబాల ఎంఎస్ఎంఇఎస్ అందరి జీవితాన్ని సులభతరం చేయడానికి – జీఎస్టీ 28 % నుంచి 18 % 18% నుంచి 5 % 12 % నుంచి 5 % 18 % నుంచి 0 % వరకు భారీ తగ్గింపులు చేసింది. ఇది నిజమైన పండుగ కానుక మహిళలు గృహిణులు ఆనందంగా చెబుతున్నారు ఇంటి ఖర్చులు తగ్గడం వల్ల పండుగలలో మరింత సంతోషం వచ్చింది. ఇది మాకు మోదీ గారి కానుక అని సంతోషిస్తున్నారు వ్యవసాయ యంత్రాలపై పన్ను తగ్గడం వల్ల ఖర్చులు తగ్గి ఆదాయం పెరగనుంది ఎప్పటిలాగే మోదీ ప్రభుత్వం రైతు స్నేహపూర్వక ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దినసరి అవసరాల వస్తువులు గృహ వినియోగ వస్తువులపై ధరలు తగ్గడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గనుంది. పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతి రైతు ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరిగేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విద్యార్థులపై భారమయ్యే పన్నులు తగ్గించి విద్య ఖర్చులు తక్కువ చేయబడింది. మధ్యతరగతి కుటుంబాల కలల వాహనాలు ఇప్పుడు మరింత అందుబాటులో ఉండేలా సామాన్యుడి కలల వాహనాలు ఇక మరింత తక్కువ ధరకు లభించనున్నాయి. ఇంటి సదుపాయాలు తక్కువ ధరలో అందేలా మోదీ ప్రభుత్వం మార్పులు చేసింది ప్రాసెస్ రిఫార్మ్స్ఎం ఎస్ ఎం ఇ ఎస్ కి పెద్ద వరం లాంటిది ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ 3 రోజుల్లో సులభమైన రీఫండ్ సిస్టమ్ జీరో రేటెడ్ సప్లైలు చిన్న వ్యాపారాలు ఎం ఎస్ ఎం ఇ ఎస్ కి భారీగా ప్రయోజనం జరగనుంది నీతి గల నిజాయితీ గల మోదీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలపై పన్నుల భారం తగ్గింది కేంద్రమంతటా వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహ రాములు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ జిల్లా నాయకులు కునమల్లా పృథ్వీ జిల్లా బీజేవైఎం నాయకులు అచ్చ దయాకర్ జూలూరి మనీష్ మాజీ కౌన్సిలర్ బోడ గోల్య సీనియర్ నాయకులు ముఖ్య నాయకులు మండల పట్టణ ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు వివిధ మోర్చాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter