సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక లో గురువారం ఉదయం బూర్గంపహాడ్ ఎస్సై పి సంతోష్ తనిఖీలు నిర్వహించగా భారీ గంజాయి పట్టుబడింది పాల్వంచ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం సారపాకనందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనం భద్రాచలం వైపు నుంచి అత్యధిక వేగంతో వస్తుండడంతో సారపాక లోని బిపిఎల్ స్కూల్ వద్ద నిలిపివేసి తనిఖీలు నిర్వహించగా TS12UD5662 నంబర్ గల టాటా ఐచర్ వాహనం లో భారీ గంజాయి పట్టుబడింది డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం తన పేరు ఫారూఖ్ అల్తాఫ్ షేక్ R/o చాలిస్ గాన్ గ్రామం మహారాష్ట్ర రాష్ట్రం, షేక్ ఖలీల్ R/o ధూలే గ్రామం మహారాష్ట్ర రాష్ట్రం అని తెలిపి తడబడగా ఆ ఐచర్ వ్యాన్ పూర్తిగా తనిఖీ చేయగా ఛాంబర్ లో ప్రత్యేకంగా ఒక డబ్బా సీక్రెట్ గా ఏర్పాటు చేయబడింది. అది తెరిచి చూడగా పది ప్లాస్టిక్ బస్తాలు ఉన్నాయి. అది గంజాయి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు అటవీ ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి తీసుకెళ్తున్నానని దానికి సంబంధించిన ఆజాద్ అనే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ లోని అరకు ఫారెస్ట్ లో గురు అనే వ్యక్తి నుండి వయా భద్రాచలం మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్ వరకు తీసుకెళ్తున్నామని తెలిపారు ఈ సరఫరాకు 10,000 ఒప్పందం కుదుర్చుకున్నామని ఒప్పుకున్నారు ఇద్దరు రెవెన్యూ అధికారులు పంచుల సమక్షంలో వీడియో గ్రాఫర్ సమక్షంలో తనిఖీ చేయగా ఆ 10 యూరియా బస్తాలలో ప్యాకెట్లు మొత్తం 96 ప్యాకెట్లు ఉన్నట్లుగా తెలిపారు అవి మొత్తం సుమారుగా ఒక క్వింటాల్ 96 కిలోలు ఉంది దాని విలువ సుమారు 39 లక్షల 34 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు వారి దగ్గర నుంచి గంజాయి వాహనము మొబైల్ ఫోన్లు సీజ్ చేసి తదుపరి చర్యగా పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లుగా విలేకరుల సమావేశంలో తెలిపారు...
-----------------------
Admin