సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు,యువత ఎవరైనా సరే సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగే విధంగా రోడ్లపై పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని బడతాయని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్లకు అడ్డంగా, డివైడర్లపై పుట్టినరోజులు, యూత్ ల పేరుతొ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ఈ చర్యలు చేపడుతుందని వెల్లడించారు.
-----------------------
Admin