Friday, 31 July 2026 08:54:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తిరుమలగిరి లో కనీసం బస్టాండ్ కూడా లేని పరిస్థితి...

Date : 16 July 2023 06:11 AM Views : 503

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి : వ్యాపారం వాణిజ్యపరంగా దినదినం అభివృద్ధి చెందుతూ నాలుగు జిల్లాలకు కూడలి అయిన తిరుమలగిరి మున్సిపల్ కేంద్రం తెలంగాణ చౌరస్తాలో బస్టాండ్ లేకపోవడం మూలంగా ప్రజలు ప్రయాణికులు బస్సుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి రోడ్డుపై నిలబడి గంటలపాటు ఎదురు చూడాల్సి వస్తుందని పలువురు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తిరుమలగిరిని మున్సిపాలిటీగా ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు కనీసం ప్రయాణికులు నిలబడడానికి బస్ షెల్టర్ నిర్మించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని పలువురు తెలిపారు. జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్న తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు రైతులు రావడం మరియు మండల కేంద్రం నుండి సూర్యాపేట, జనగాం, హైదరాబాద్, వరంగల్, విజయవాడ లాంటి పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు తెలిపారు. ప్రతి సంవత్సరం తిరుమలగిరి కి మార్కెట్ సంత మున్సిపాలిటీ పన్నుల రూపంలో లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న కనీసం ప్రయాణికులకు బస్టాండ్ సౌకర్యం కల్పించకపోవడంలో పూర్తిగా విఫలమైందని పలువురు తెలిపారు.బస్ స్టాండ్ లేకపోవడంతో మూడు బస్సులు ఎదురెదురుగా ఒకేసారి రావడంతో ఇటు ప్రయాణికులకు, అటు ట్రాఫిక్ కూ అంతారాయం జరిగింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి  ప్రయాణికులు,ప్రజల సౌకర్యం కోసం బస్ స్టాండ్ ను నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :