సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు 24గంటలపాటు దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎం ఏ ) అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ డాంగే, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్ రమేష్ లు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. కలకత్తా లో మహిళా డాక్టర్ దారుణ హత్య ను నిరసిస్తూ ఈ నెల17 వతేది ఉదయం 6 గంటల నుండి 18 ఉదయం గంటల వరకు హాస్పిటల్ కి వచ్చే రోగులకు వైద్య సేవలను బంద్ చేయడం జరుగుతుందన్నారు.కేవలం హాస్పిటల్ లో అంతకు ముందు ఉన్న రోగులకు మాత్రమే సేవలను కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 17 ఉదయం 6గంటలకు మెడికల్ కళాశాలనుండి పాత బస్టాండ్, పీఎస్ ఆర్ సెంటర్, వాణిజ్య భవన్, శంకర్ విలాస్ సెంటర్, నుండి కొత్త బస్టాండ్ వరకు బారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కావున ప్రజలు, రోగులు సహకరించగలరని కోరారు.
-----------------------
Admin