Saturday, 13 June 2026 11:33:48 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

"చదువు మాన్పించి పెళ్లి చేశారనీ" నవ వధువు ఆత్మహత్య...

Date : 23 April 2024 10:05 AM Views : 408

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చండ్రుగొండ మండలం మంగయ్యబంజర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు శ్రీను, పద్మ దంపతుల కుమార్తె భూక్యా దేవకి (23). ఆమె కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కాలేజీలో చదువుతోంది. ఈ ఏడాదే డిగ్రీ కూడా పూర్తి చేసింది. డిగ్రీ తర్వాత పై చదువులకు వెళ్తానని పట్టుబట్టింది. అయితే తల్లి తన ఆరోగ్యం బాగుండడం లేదనే సాకుతో కుమార్తెకు నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించింది. ఈ క్రమంలో అదే మండలంలోని దుబ్బతండాకు చెందిన గుగులోత్‌ బాలరాజుతో వివాహం కుదిర్చారు. మార్చి 28న దేవకికి బాలరాజుతో వివాహం జరిపించి, అత్తరింటికి పంపించారు. ఈ నెల12న 16 రోజుల పండుగ నిమిత్తం నూతన వధూవరులను బంధువులు మంగయ్యబంజర్‌ తీసుకొచ్చారు. ఆ మరుపటి రోజే అంటే ఏప్రిల్‌13వ తేదీ అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో దేవకి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను జూలూరుపాడు ఆస్పత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కొత్తగూడెంకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కూడా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూసింది. దీంతో తల్లి భూక్యా పద్మ, తండ్రి శ్రీను కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు చండ్రుగొండ ఎస్సై మాచినేని రవి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :