సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారబోతుంది అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార పక్షం సహా విపక్షాలు స్పీడ్ పెంచాయి. ముఖ్యంగా కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ విజయం సాధించాలని ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో భాగంగా తెలంగాణ కొత్త నినాదంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. తిరగబడం, తరిమికొద్దాం అనే నినాదంతో ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతోందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాకోర్టులను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిందని తెలిపారు. అదే సమయంలో ఓ నంబర్ కు మిస్ట్ కాల్ ఇచ్చి ఈ ప్రజా పోరుకు తెలంగాణ సిద్ధంగా ఉందని చాటి చెప్పాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్-బీజేపీ దొంగలు అంటూ కరపత్రాలు ముద్రించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలవనున్నారు. తెలంగాణ ప్రజల కలలు నెరవేరలేదన్నారు. కేసీఆర్ మోసాలను బయటపెడతామన్నారు. తెలంగాణ ఇచ్చి. ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చారని అన్నారు. కేసీఆర్ తన రాజకీయం కోసం, తన కుటుంబం కోసం పార్టీని బలోపేతం చేస్తున్నారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తూ తన కుటుంబ సంపదను పెంచుకుంటున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని వ్యాఖ్యానించారు.
-----------------------
Admin