సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట టౌన్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, మండల సేవా పక్షం అభియాన్ కార్యశాల కార్యక్రమం మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథులుగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూసెప్టెంబర్ 17 మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జన్మదినం వరకు జాతీయ పార్టీ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా 15 రోజులు మహనీయుల జన్మదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం,మొక్కలను నాటడం, స్వచ్ఛభారత్ లాంటి సేవా కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవంగా సందర్భంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని కోరడం జరిగింది.అదే రకంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు.కేంద్రం నుంచి రావలసిన 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు మూడు వేలకోట్ల రూపాయలు వృధాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నందునే స్ధానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఓ బి సి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ గంగిడి మహేందర్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శులు తాళ్లపెల్లి రాము,భట్టు మదన్,మండల ఉపాధ్యక్షులు బోయిని సుధాకర్,బుసాని సుదర్శన్,పురానీ రమేష్,దుంకదువ్వ మహేష్ , బీజేవైఎం నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ ఆముదాల రమేష్ , మండల సీనియర్ నాయకులు,బూత్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు,వివిధ మోర్చాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter