సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండల కేంద్రం నందు రమాబాయ్ జయంతి వేడుకలు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమం లో బీఎస్పీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ తాను ఒక పూట తిని, మరో పూట పస్తులుండి, డబ్బులు కూడా పెట్టి అంబేద్కర్ పై చదువుల కోసం ఇచ్చి మనం పుట్టకన్న ముందే మన బతుకుల గురించి ఆలోచించిన త్యాగమూర్తి మాతా రమాబాయి అని కొనియాడారు ఈ కార్యక్రమం లో 26 th జనవరి రిపబ్లిక్ డే సందర్బంగా ఢిల్లీ పెరేడ్ లో డప్పు వాయించి మన హుజూర్ నగర్ నియోజకవర్గ పేరును దేశం అంతా వినిపించేలా చేసిన మహిళలకు పేరూపొగు కల్పనా, అమరవరపు అనురాధ,చిలక సంధ్య,నన్నెపంగ రమణ వీరి మాస్టర్ అమరవరపు సతీష్ లను సన్మానించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెదపంగ ఉపేందర్, నియోజకవర్గ మాజీ ఇంచార్జి కొండమిది నర్సింహా రావ్, నియోజకవర్గ అధ్యక్షులు జిలకర రామస్వామి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి,తకెళ్ళ నాగార్జున, పొట్టేపోగు సతీష్, కొత్తపల్లి రవి, చిన్న అబ్రహం తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin