సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం ఓ.డి. చెరువు మండలం, కొండకమర్ల సచివాలయం-2 పరిదిలోని కొండకమర్ల పంచాయతీ లోని పోలేవాండ్ల కొత్తపల్లి గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా కొండకమర్ల నుంచి పోలే వాండ్ల కొత్త పల్లి వరకు ఇటివల నిర్మించిన రోడ్డు ను పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం ఇంటిని సందర్శించి వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని అక్కడికి అక్కడే ప్రభుత్వ అధికారుల ద్వారా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పరిష్కరించడం జరిగింది. ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పుట్టపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు దుద్దకుంట శ్రీధర్ రెడ్డి కొనియాడారు. ఆదివారం మండలములోని పోలే వాండ్ల పల్లి ,కొండకమర్ల సచివాలయ2పరిధిలోని గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని, పేదవారికి కొండంత అండగా మన జగనన్న ఉన్నాడని, ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఓబుళ దేవర చెరువు మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రమంతా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోందని అన్నారు. ఇది చూసి దుష్ట చతుష్టయం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, అందుకే లేనిపోనివన్నీ కల్పించి తమ విష పత్రికల్లో అవాస్తవాలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు. జగనన్న పాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజలను ఆదుకునేందుకు జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అవి దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్నాయనే ప్రశంసలు లభించాయనే సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. కొన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఇప్పటికే మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి జగనన్న సంక్షేమ పథకాలు, అవి పేద ప్రజలకు అందుతున్న తీరు, ఆ విశేషాలు అన్నీ తెలుసుకొని వెళుతున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు మన ఆంధ్ర దేశ ప్రగతి ఆదర్శంగా ఉంటే ఇక్కడ ప్రతిపక్షాలకు మాత్రం అవేమీ కనిపించడం లేదని నిత్యం విషం కక్కుతూనే ఉన్నారని విమర్శించారు. ఇవన్నీ విజ్ఞులైన ప్రజలే గమనించి జగనన్నకు ఓటేసి మళ్ళీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మద్దె రాజునాయుడు, టౌన్ కన్వీనర్ కోళ్ల క్రిష్ణారెడ్డి, జడ్పీటీసీ కుర్లి దామోదర్ రెడ్డి, ఎంపీపీ పర్వీన్ షామీర్ బాషా, నల్లమాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి, చింతమాని పల్లి సర్పంచ్ జగన్మోహన్ చౌదరి, ఎంపీటీసీ గణేష్, మండల అగ్రి అడ్వైసర్ లక్ష్మీరెడ్డి, సొసైటీ అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, జైపాల్ రెడ్డి, డీలర్లు సింగనమల బాబు, సూరి, బాబ్జాన్ వైయస్సార్ నాయకులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin