Thursday, 30 July 2026 06:53:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మం సభకు సన్నాహలు...

Date : 14 January 2023 11:47 PM Views : 950

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఖమ్మంలో ఈనెల 18న జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శనివారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియ హరిసింగ్ నాయక్, రేగా కాంతారావు లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంపూర్ణ మద్దతునిస్తున్నారని, బీఆర్ఎస్ కు కొండంత అండగా ఉన్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలలో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సంపూర్ణ సహకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేశారని, చేస్తున్నారని వివరించారు. ఖమ్మంలో ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారని, దీనికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా గులాబీ శ్రేణులు, ప్రజలను కోరారు. ఈ సందర్బంగా ఛలో ఖమ్మం పోస్టర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, మునిసిపల్ ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర రావు, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అంకోతు బిందు, బీఆర్ఎస్ నాయకులు సర్థార్ పుట్టం పురుషోత్తం, వద్ధిరాజు కిషన్, గుండ్లపల్లి శేషగిరిరావు, గంధం రాములు, జెల్లల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: