సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : క్రీస్తు సిలువ వేయబడిన రోజును స్మరించుకుంటూ ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోని సి అండ్ ఐ జి మిషన్ చర్చిలో గుడ్ ఫ్రైడేను శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసు క్రీస్తు సిలువలో చివరిగా పలికిన ఏడు మాటలను ధ్యానించారు. క్రైస్తవులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు సిలువ త్యాగాన్ని స్మరిస్తూ ప్రత్యేక గీతాలను ఆలపించారు. యేసు సిలువలో పలికిన ఏడు మాటలను జయానందం, బాలరాజు, రాజశేఖర్, ఆశీర్వాదమ్మ, రోజ్ మేరీ, మణి, రూబీ బోధించారు. పాస్టర్ రెవరెండ్ డాక్టర్ ఎంజి.జయానందం మాట్లాడుతూ ఆనాడు లోక రక్షణ కోసం యేసు క్రీస్తు సిలువ వేయబడ్డారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన సన్మార్గంలో నడవాలని సూచించారు. అందరూ ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమాగుణం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి దార్ల రాజశేఖర్, సభ్యులు ఎం యు రఘు కుమార్, కె బాలరాజు, టి ఎం రాజకుమారి, సునీల్, ప్రభు కుమార్, సుగుణమ్మ పాల్గొన్నారు.... ఈస్టర్ వేడుకలు క్రీస్తు మరణించి తిరిగి లేచిన దినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఈస్టర్ వేడుకలు నిర్వహించనున్నట్లు మండల కేంద్రంలోని సి అండ్ ఐ జి మిషన్ చర్చి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ ఎంజి.జయానందం, కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్చిని పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు పేర్కొన్నారు......
-----------------------
Admin