సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడుగా ,హైకోర్టు అడ్వకేట్ బాలాజీ పవర్... హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీలకు దాదాపుగా 40 శాతం సీట్లు కేటాయించడం జరుగుతుంది. కావున హుజూర్నగర్ ప్రాంతంలో ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీలు 80% ఈ ప్రాంతంలో అత్యధికంగా జనాభా కలిగి ఉన్నారు. కావున ఈ ప్రాంతంలో వెనుకబడిన కులాల వారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని అలాగే ఈ ప్రాంతంలో ఉప ఎన్నికల్లో సందర్భంగా బీ. ఆర్.ఎస్ పార్టీకి అవకాశం కల్పించడం జరిగింది . ఇప్పుడు కొందరు ఇతర పార్టీలకు వలసలు చేరటం జరుగుతుంది కొందరు నాయకులు ఎక్కడ లాభం ఉంటే అక్కడ నాయకులు పావులు కదుపుతున్నారు,కానీ ఈ ప్రాంతంలో ఉన్న వెనకబడిన కులాల వారిగా ఎక్కువగా మంది ప్రజలు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు నేను గుర్రంపొడు ప్రాంతంలో ఉన్న భూములను కొంతమంది నాయకులు కబ్జా చేయడం జరిగింది ,గుర్రంపొడు భూముల కోసం దాదాపుగా ఏడు సంవత్సరాలు పోరాటం చేయడం అలాగే ఈ ప్రాంతానికి బండి సంజయ్ రావడం అలాగే అధికార పార్టీ చెందిన నాయకులు మా పై కేసులు పెట్టడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు పిల్లలు లేరు ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలే మా పిల్లలు అని చేపారు .నేను ఈరోజు అడుగుతున్నాను ఈ ప్రాంతంలో ఉన్న బహుజన బిడ్డల్ని ఎవర్ని ఆదరించావు , ఎవర్ని పెద్ద నాయకుడు చేశావు .ఎవరికి అవకాశం ఇచ్చావు, ఎవరిని పైకి తీసుకొచ్చావు, దీనికి సమాధానం చెప్పాలి అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ తోనే సైదిరెడ్డి గెలిచాడు , ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదు,కాని ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు, కొత్తగా పార్టీలొకి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే పార్టీ గెలవలేదు కాబట్టి పార్టీ ఆలోచన చేయాలి అని అన్నారు.
-----------------------
Admin