సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం. నాగినేనుప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగునున్నట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడి చేసిన నిర్వాహకులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల4వ తేదీ గురువారం రోజున సాయంత్రం 6 గంటలకు స్వామి వారి కళ్యాణ వేడుక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నుండి ఉత్సవమూర్తులు తీసుకువచ్చి కళ్యాణ వేడుక జరుపనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సాంప్రదాయ బద్ధంగా టిటిడి రిత్వికల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తిరుకళ్యాణం జరుపుకున్నట్లు తెలియజేసిన నిర్వాహకులు. ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమంలో అనంతరం సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుక. సుమారు15 వేల మంది భక్తులు హాజరుకానున్నాట్లు నిర్వహికులు అంచనా కళ్యాణ వేడుక అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి,అనంతరంఅన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. పాకాల దుర్గాప్రసాద్ మల్లేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల తిరుపతి నుండి ఉత్సవమూర్తులు రెడ్డిపాలెం గ్రామానికి తీసుకువచ్చి కనివి ఎరుగని రీతిలో స్వామివారి కళ్యాణం జరుపు తున్న నేపథ్యంలో భక్తులందరూ స్వామివారి కళ్యాణం తిలకించి ఆయన కృపా కటాక్షాలు పొందాలని పేర్కొన్నారు. ఈ కళ్యాణానికి అందరూ పెద్దలేనని అందరూ విచ్చేసి కళ్యాణం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లోక కళ్యాణ నిమిత్తం ఈ కళ్యాణం ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.
-----------------------
Admin