Saturday, 13 June 2026 12:47:40 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదిన వేడుకలు...

Date : 17 January 2023 12:49 AM Views : 618

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు,మాజీ ముఖ్యమంత్రి బెహన్ కుమారి మాయావతి 67వ జన్మ దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రనికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన బాధ్యతలు నిర్వహించి పేద,బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు..సఫాయి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దికరించి,23జిల్లాలో అన్ని హంగులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలను నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించారని వివరించారు..అంతేకాకుండా దాదాపు 200 ల ఇంటర్మీడియట్ కళాశాలలను ఏర్పాటు చేశారని మరో 5,549 ప్రభుత్వ పాఠశాలలను నిర్మించి ఉచిత విద్యను అందించిన గొప్ప నేతగా అభివర్ణించారు,28,419 గ్రామలకు అంబేద్కర్ గ్రామ నిర్మాణ్ పథకం ద్వారా అభివృద్ధి చేసిన ఘనత ఆమెకు దక్కిందని ప్రశంసించారు..భవిష్యత్తులో దేశ ప్రధానిగా ప్రజలకు సేవ చేసేందుకు అన్ని అర్హతలతో ముందుకు వస్తున్నారని ప్రజలు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు విసిగి పోయారని 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఆమె నాయకత్వంలో బీఎస్పీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.. ఈకార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ గంధం మల్లికార్జున్ రావు,సాయి,అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా,నాగుల రవికుమార్,తాటిపాముల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :