Saturday, 13 June 2026 02:07:47 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ప్రజా పాలన అంటూ పేద ప్రజలను పీడిస్తున్న కాంగ్రెస్ సర్కార్...

Date : 31 October 2024 12:46 PM Views : 385

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం, చౌటపల్లి* గ్రామంలో బిఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో అమలు కానీ ఆరు హామీలను ఇచ్చి గెలిచాక ఆ 6 హామీలను అటకెక్కించి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, చేసిన రెండు హామీలు కూడా పూర్తిస్థాయిలో చేయక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని, పైగా రేవంత్ సర్కార్ ప్రజా పాలన చేస్తామంటూ చెప్పి ప్రజలను పీడిస్తోందని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో గత నెలలో భారీ వర్షాలతో చెరువులన్నీ కట్టలు తెగి రైతుల పొలాలన్నీ కొట్టుకుపోగా వారిని ఆదుకోకపోగా చెరువు పనులను గుత్తేదారులు ఒకరి నుంచి ఒకరు మార్చుకుంటూ వాటి పైసలను వాటాలుగా పొందుతూ, చెరువు మరమ్మత్తు పనులను ఎక్కడికక్కడే గాలికి వదిలేశారని, ఇట్టి పనుల్లో పారదర్శకత లేక కాంగ్రెస్ లీడర్ల జేబులు నింపేదిగా ఉందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. గత సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో నడిపి హైదరాబాద్ నగరాన్ని దేశంలోని అగ్రగామిగా నిలబెట్టారని, రేవంత్ మాత్రం పది నెలల్లో హైదరాబాదులో నివసించాలంటేనే భయపడేలా 144 సెక్షన్ విధించి ప్రజల్లో ఆందోళనలు సృష్టిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ పేద ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు రూపంలో దాదాపు 18 వేల కోట్ల రూపాయల భారం మోపాలని చూస్తే బి ప్రభుత్వ చొరవతో ఇ ఆర్ సి ఈ పెంపు ఉండబోదని తెలిపింది. కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య , సీనియర్ నాయకులు మన్నెం శ్రీనివాస్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి బానోతు జగన్ నాయక్ , డాక్టర్ కే ఎల్ ఎన్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు , ఉద్యమ నాయకులు వేముల రంగాచారి , మాజీ మండల పార్టీ అధ్యక్షులు కోలాహలం కృష్ణంరాజు , చౌటపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరంరెడ్డి వీరారెడ్డి , పలువురు మండల సీనియర్ నాయకులు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :