Friday, 31 July 2026 06:52:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బడ్జెట్ కేటాయింపులో నిరుద్యోగ భృతి అమలుకు ఊసేలేదు... చింతల రమేష్, డి. వై. యఫ్. ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు

Date : 08 February 2023 11:09 PM Views : 707

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కారేపల్లి లో డి. వై. యఫ్. ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల. రమేష్ అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులో నిరుద్యోగ సమస్య పరిష్కరానికి చిత్తశుద్ధి ఎక్కడ ఉందని, రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో నిరుద్యోగ భృతి అమలుకు అసలు ఊసేలేదు అన్ని, క్రీడా రంగానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని డి. వై. యఫ్. ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల. రమేష్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేయడాని నిరసిస్తూ డి. వై. యఫ్. ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, బడ్జెట్ ప్రతుల దహన కార్యక్రమంలో భాగంగా కారేపల్లి మండల పరిధిలోని స్థానిక పాటిమీద గుంపు గ్రామంలో డి. వై. యఫ్. ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల దహనం చేసి అనంతరం జరిగిన డి. వై. యఫ్. ఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ కేంద్ర బడ్జెట్ లో కేటాయించలేదని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో కేవలం ఎనభై వేల ఉద్యోగాలకు మాత్రమే నిధులు కేటాయించారని, మిగిలిపోయిన ఖాళీల భర్తీకి నిధులు కేటాయించలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతిని రూ, 3016 లు ఇస్తామని హామీ ఇచ్చి, కనీసం బడ్జెట్ కేటాయింపులో అసలు ఆ ఊసే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో క్రీడా రంగానికి అధిక నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ కేటాయింలులో నిరుద్యోగ సమస్య పరిష్కరానికి చిత్తశుద్ధిని ప్రదర్శించలేదని, నిరుద్యోగ యువత పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి. వై. యఫ్. ఐ జిల్లా నాయకులు ధరవత్. వినోద్, డి. వై. యఫ్. ఐ మండల కార్యదర్శి ధరవత్. రవి కుమార్, మండల నాయకులు ధరవత్. సంతోష్, బాణోత్. బావుసింగ్, ధరవత్. వీరన్న తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: