Thursday, 30 July 2026 10:41:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అభివృద్ధి చేశా ఆశీర్వదించండి అంటూ ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ ...

Date : 17 October 2023 12:19 AM Views : 219

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ నే సీఎం చేయాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రజలను కోరారు. సోమవారం షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలోని బైర్ఖాన్ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గ్రామంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు అవశ్యకతను ప్రజలకు వివరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ బిజెపి పార్టీలు ప్రయత్నిస్తాయని తెలంగాణ ప్రజలు వారి మాయలో పడకూడదన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామంలో 89.43 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం, 21 లక్షలతో అంతర్గత మురుగుకాలువల నిర్మాణం, ఆసరా పింఛన్ ధ్వారా 149 మంది కి ప్రతి నెలకు 3.66 లక్షలు అందించడమే గాక రైతు బంధు లబ్ధిదారులు 740 మంది, రూ. 7.67 కోట్లు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు 82 మంది, రూ. 25.85 లక్షలు, v రైతు భీమా లబ్ధిదారులు 10 మంది, రూ. 50 లక్షలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు 38 మంది, 38.01 లక్షలు అందించడం జరిగిందన్నారు. కొత్తూర్ నుండి కొత్తపేట వయా భైరఖాన్ పల్లి డబల్ రోడ్డు 33.4 కోట్లు, భైరఖాన్ పల్లి బి.టి రోడ్డు నిర్మాణం కోసం 23.01 లక్షలు, సిద్దాపూర్ నుండి కొండారెడ్డి పల్లి వయా తెట్టేకుంట తండా వరకు బి.టి రోడ్డు నిర్మాణం 5.7 కోట్లు, ఎక్లాస్ ఖాన్ పేట నుండి భైరఖాన్ పల్లి వరకు బి.టి రోడ్డు నిర్మాణం 35 లక్షలు, లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రూ. 50 లక్షలు, దాదాపు 65.71 లక్షలతో మిషన్ భగీరథ ద్వారా 3 ట్యాంకుల నిర్మాణం ద్వారా 289 గృహాలకు నల్లా కనెక్షన్లు, త్రాగునీటి సరఫరా, మిషన్ కాకతీయ ద్వారా అమ్మ చెరువు పూడిక కోసం 17.84 లక్షలు, పోస సముద్రం పూడిక కోసం 10.95 లక్షలు, చెన్న చెరువు పూడిక కోసం 15.80 లక్షలు నిధులు మంజూరు, మంచినీటి సమస్య పరిష్కారం కోసం 9 బోర్ మోటార్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరోసారి ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :